అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్ వద్ద చోటు చేసుకుంది. రాజంపేట మండలం(Rajampet Mandal) సిద్దాపూర్ గ్రామానికి చెందిన పచ్చంటి శేఖర్ (32) దసరా రోజు సరదాగా చేపల వేటకు వెళ్లాడు.
పోచారం ప్రాజెక్ట్(Pocharam Project) దిగువన తన కుమారుడితో కలిసి చేపలు పడుతుండగా.. గాలం నీటిలో ఇరుక్కుంది. దీంతో దానిని తీసేందుకు నీటిలోకి దిగిన శేఖర్ ఎంతకు బయటకు రాలేదు. దీంతో ఆయన కుమారుడు పక్కన ఉన్న వారికి చెప్పాడు. వారు అక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో నీటిలో వెతకగా.. శనివారం ఉదయం మృతదేహం లభించింది. శేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్(Nagireddypet SI Bhargav) గౌడ్ తెలిపారు.