143
అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Bheemgal Police | గంజాయిని తరలిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భీమ్‌గల్ ఎక్సైజ్ పోలీసులు (Bheemgal Excise police) వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు భీమ్‌గల్ మండలం బాబానగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school) సమీపంలో రూట్‌వాచ్ నిర్వహించారు.
ఈ క్రమంలో భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన కనక రాహుల్ బైక్పై గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి 83 గ్రాముల ఎండు గంజాయి, ఒక సెల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ గోవర్ధన్, కానిస్టేబుల్ దత్తాద్రి, జగదీష్ సురేందర్ పాల్గొన్నారు.