అక్షరటుడే, బాన్సువాడ: Tadkol | కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్కోల్ శివారులోని డబుల్ బెడ్రూం కాలనీలో (Double bedroom colony) నివాసముండే ఇందూరు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా వీరంతా హైదరాబాద్లో నివాసముంటున్నారు. ఇటీవల తాడ్కోల్కు వచ్చిన రాజు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
