అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chinese manja | చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) వివరాలు వెల్లడించారు.
నగరంలో పలు పతంగుల దుకాణాల్లో చైనామాంజా (Chinese manja) విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దాడులు చేశారు. పోస్ట్ఆఫీస్ వెనక ప్రాంతంలో సుల్తాన్ కైట్ షాప్ (kite shops) వద్ద సయ్యద్ అస్లామ్ అనే వ్యక్తి చైనామాంజా అమ్ముతుండగా పట్టుకున్నారు. తన బైక్‌లో తీసుకెళ్తున్న 18 చైనామంజా చర్కాలను స్వాధీనం చేసుకున్నారు. అతడి యజమాని ఫయీం అన్సారీ పరారయ్యాడు.
Chinese manja | హత్యాయత్నం కేసు
వీరిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. మనుషులకు, పక్షులకు ప్రాణాంతకంగా మారిన చైనామాంజాను ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ సాయికిరణ్, నవీన్, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.