అక్షరటుడే, కామారెడ్డి: ASP Chaitanya Reddy | విజయదశమి (Vijayadashami) రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు ‘100’కు కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ రెండు గ్రూప్లు కొట్టుకుంటున్నాయని తెలిపారు.
ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా గాజుముక్కతో దాడి జరిగినట్లు తేలిందన్నారు. అలాగే కేతన్, ప్రఫుల్ అనే ఇద్దరు యువకులపై సిద్దార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేశాడన్నారు.
ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయని, సిద్దార్థ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.