అక్షరటుడే, ఇందల్వాయి: CPIML Massline | ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించాలని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డిచ్పల్లి(Dichpally) తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) మండల కార్యదర్శి బోశెట్టి మురళి మాట్లాడుతూ పెట్రోల్ బంక్(Petrol station) యజమానులు వినియోగదారులకు కల్తీ పెట్రోల్, కల్తీ డీజిల్ అమ్ముతున్నారన్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోసేటప్పుడు తూకాల్లో తేడా ఉంటుందని ఈ విషయాలు అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
CPIML Massline | సౌకర్యాలు కరువు
పెట్రోల్ బంక్‌లలో పలు రకాల సేవలు ఉచితంగా అందించాల్సిన నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. వాహనాల టైర్లలో ఉచితంగా గాలిని నింపాల్సి ఉన్నా.. డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. పలు బంక్‌ల్లో గాలి నింపే సౌకర్యం ఏర్పాటు చేయడం లేదన్నారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఈ సౌకర్యాలు పెట్రోల్ పంపులలో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా మండల సహాయ కార్యదర్శి వాసరి మోహన్, నాయకులు అశోక్, శేఖర్, మోహన్, సాయిలు, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
