అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగికి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్ అధికారులు (Project Officers) సోమవారం ఉదయం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని విడుదల చేశారు.
Nizamsagar Project | 550 క్యూసెక్కులు..
ప్రాజెక్టు నుంచి సోమవారం ఉదయం 550 క్యూసెక్కులు నీటిని ప్రధాన కాలువకు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధిక ప్రవాహం ఉంటున్న కారణంగా పశువులు, గొర్రెల కాపర్లు కాలువలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని వారు పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు పొరపాటున కూడా కాలువను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ దక్షిణ మూర్తి, ఈఈ బాన్సువాడ సీహెచ్ రాజశేఖర్, నిజాంసాగర్ ఈఈ సోలోమన్ (Nizamsagar EE Solomon), నిజాంసాగర్ డీఈఈ ప్రవీణ్‌కుమార్, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.