అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | నగరంలోని కల్లు డిపోలను ఎక్సైస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. డిపోల్లో కల్లు తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురువారం పరిశీలించారు.
Excise Department | లైసెన్స్‌ల పరిశీలన
నగర పరిధిలోని మూడు కల్లు డిపోలలో లైసెన్స్‌లను(License in Depot) అధికారులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న(Enforcement CI Swapna) మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన కల్లునే తయారు చేయాలని తయారీదారులకు సూచించారు.
Excise Department | ఈత వనం తనిఖీ..
మల్లారంలో 16 ఎకరాల్లో ఉన్న ఈతవనాన్ని ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. ఈతవనం నుంచే కల్లును సేకరించాలని.. ఆ కల్లునే విక్రయించాలని తయారీదారులకు సూచించారు. అధికారుల వెంట ఎస్‌హెచ్‌వో సుష్మిత, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Excise Department | కూకట్‌పల్లిలో ఘటనతో అప్రమత్తం..
హైదరాబాద్‌లోని(Hyderabad) కూకట్‌పల్లిలో (Kukatpally) కల్తీకల్లు తాగి ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా నిజామాబాద్(Nizamabad) జిల్లాలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా నగరంలోని కల్లుడిపోలను అధికారులు తనిఖీలు చేశారు. స్వచ్ఛమైన కల్లునే అమ్మాలని ఆదేశాలు జారీ చేశారు.

మల్లారంలో ఈతవనాన్ని పరిశీలిస్తున్న ఎక్సైజ్ అధికారులు
