Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ఆక్రమణలపై అధికారుల కన్నెర్ర.. కామారెడ్డిలో అక్రమ కట్టడాల కూల్చివేత

Kamareddy | ఆక్రమణలపై అధికారుల కన్నెర్ర.. కామారెడ్డిలో అక్రమ కట్టడాల కూల్చివేత

మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేశారు. వీక్లీ మార్కెట్​లోని సర్వే నం.6లో నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేశారు. వీక్లీ మార్కెట్​లోని సర్వే నం.6లో నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు (Revenue Officers) పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్​లో (Weekly Market) సర్వే నం.6లో స్థలాన్ని కొందరు కబ్జాదారులు ఆక్రమించుకుని అక్రమ కట్టడాలను నిర్మించారు. దాంతో కొద్దికాలంగా ఈ ప్రాంతంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

కబ్జాల వ్యవహారాన్ని నాటి బీజేపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana Reddy) లేవనెత్తారు. ఈ విషయమై బాధితులు, అధికారులు కోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు అమలులో జాప్యం కావడంతో మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు సోమవారం మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం సదరు సర్వే నంబర్​లో అక్రమ కట్టడాలను నోటీసులిచ్చి పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు.

అయితే కొంతమంది వ్యక్తులు కల్లు దుకాణం, ఇసుక కుప్పల అమ్మకాలు, ఇతర వాణిజ్య వ్యాపారాల కోసం ఏర్పాటు చేసిన షెడ్​లను జేసీబీ సాయంతో మున్సిపల్ అధికారులు (Municipal Officers) తొలగించారు. దీంతో బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గత ఏళ్ల నుంచి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని తెలిపారు. సర్వేనం.8లో ఉన్న దుకాణాలను తొలగించడం సరైంది కాదన్నారు. సర్వే నం.6 మున్సిపాలిటీకి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలను కాకుండా పక్కన ఉన్న దుకాణాలను తొలగించడం బాధాకరమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.

Must Read
Related News