అక్షరటుడే, వెబ్డెస్క్ : UCO Bank Jobs | ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూకో బ్యాంక్ పలు పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. జనరలిస్టిక్ (Generalist), స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఎంజీఎస్-I, ఎంఎంజీఎస్-II స్కేల్‌లలో రెగ్యులర్ ప్రాతిపదికన ఆయా పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 173.
పోస్టుల వారీగా వివరాలు..
జేఎంజీఎస్-I(జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I)..
ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్- 30
చార్టర్డ్ అకౌంటెంట్- 50
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్- 5
డాటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 3
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 3
సాఫ్ట్‌వేర్ డెవలపర్- 15
మ్యూరెక్స్ డెవలపర్- 5
ఫినాకిల్ డెవలపర్- 5
క్లౌడ్ ఇంజినీర్- 3
ఏఐ/ఎంఎల్ ఇంజినీర్- 2
డాటా అనలిస్ట్- 2
డాటా సైంటిస్ట్- 2
సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్- 3
డేటా ప్రైవసీ కంప్లయన్స్ ఆఫీసర్ – 2
ఎంఎంజీఎస్-II (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-II)..
ట్రెజరీ ఆఫీసర్- 10
చార్టర్డ్ అకౌంటెంట్- 25
డాటా అనలిస్ట్- 3
డాటా సైంటిస్ట్- 3
డాటా ఇంజనీర్- 2
విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్?/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంబీఏ/సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి : ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీనాటికి..
జేఎంజీఎస్ పోస్టులకు 20 నుంచి 30 ఏళ్లు, ఎంఎంజీఎస్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
వేతన వివరాలు :
నెలకు జేఎంజీఎస్ పోస్టులకు రూ.48,480 – రూ.85,920
ఎంఎంజీఎస్ పోస్టులకు రూ.64,820 – రూ.93,960.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : ఫిబ్రవరి 02.
పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, ఇతరులకు రూ.800.
ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://uco.bank.in లో సంప్రదించండి.