అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Rajanarsimha | వైద్యారోగ్య శాఖలో రెండేళ్లలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarasimha) తెలిపారు. 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) నియామక పత్రాలను మంగళవారం అందించారు.
కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ (Osmania Medical College) గ్రౌండ్స్‌లో నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 1257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు.
Minister Rajanarsimha | రిపోర్టులు కీలకం
ల్యాబ్ టెక్నీషియన్లు (lab technicians) ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికమని మంత్రి అన్నారు. వైద్య వ్యవస్థకు వాళ్లు కళ్లు, చెవుల్లాంటి వారని అభివర్ణించారు. మీ రిపోర్టుల్లో కచ్చితత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్ఏబీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి తెలిపారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటివరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని మంత్రి వెల్లడించారు.
Minister Rajanarsimha | హెల్త్ పాలసీ రూపొందిస్తాం
నూతన హెల్త్ పాలసీని రూపొందించి, అమలు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఆరోగ్యశాఖను సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తనకు ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.