అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తేవడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు పలువురికి నోటీసులు జారీ చేస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో (Panjagutta Police Station) కేసు నమోదైంది. రెండేళ్లు కావొస్తున్నా ఈ కేసు ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును (Prabhakar Rao) ఇటీవల సుదీర్ఘంగా విచారించారు.
Phone Tapping Case | ఎమ్మెల్సీ తండ్రికి నోటీసులు
సిట్ బృందం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును (BRS MLC Naveen Rao) ఇటీవల సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 8 గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. తాజాగా నవీన్ రావు తండ్రి కొండలరావుకు సైతం నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు సైతం నోటీసులు జారీ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసులో మరింత మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.