అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nothing Phone 3a Lite | ప్రముఖ బ్రిటిష్ కంపెనీ (British Company) నథింగ్.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో మోడల్‌ను రిలీజ్ చేసింది. స్టైలిష్ డిజైన్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 3ఏ లైట్ పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో రేపటినుంచి(డిసెంబర్ 5) అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 3ఏ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.77 అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్.. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. స్క్రీన్, బ్యాక్ ప్యానెల్‌పై పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఇది కిందపడినా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్‌సంగ్ సెన్సార్, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0తో ఎక్కువ లైట్ ఉండేలా క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా ఎక్స్‌డీఆర్, నైట్, పోర్ట్రెయిట్, మ్యాక్రో, మోషన్ క్యాప్చర్ మోడ్స్ ఉంటాయి. 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 ఎంపీ ఉంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో (4nm) ప్రాసెసెర్ అమర్చారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బాగుంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరేళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 33 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, 5 డబ్ల్యూ రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 20,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ. 22,999. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 1,000 డిస్కౌంట్ వర్తించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
