Gampa Govardhan | రెండేళ్లలో కామారెడ్డిలో తట్టెడు మట్టి కూడా తీయలేదు: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

అక్షరటుడే, కామారెడ్డి : Gampa Govardhan | అధికార పార్టీలో సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ అలీ (Shabbir Ali), ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రెండేళ్ల కాలంలో కామారెడ్డిలో తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్ శివారులో బుధవారం బృందావన్ గార్డెన్​లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. Gampa Govardhan | హామీల అమలులో విఫలం.. ఈ […]

అక్షరటుడే, కామారెడ్డి : Gampa Govardhan | అధికార పార్టీలో సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ అలీ (Shabbir Ali), ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రెండేళ్ల కాలంలో కామారెడ్డిలో తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్ శివారులో బుధవారం బృందావన్ గార్డెన్​లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Gampa Govardhan | హామీల అమలులో విఫలం..

ఈ సందర్భంగా గంప గోవర్ధన్​ మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో సంక్షేమ ఫలాలు అందాయని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఝూటా హామీలిచ్చారని, ఓట్లు వేయించుకుని గడ్డమీద కూర్చున్నారని విమర్శించారు. సీఎం స్థాయిలో ఉండి తెలంగాణ తెచ్చిన గులాబీ జెండా గద్దె కూల్చాలని చెబుతున్నారని, ఒక సీఎం మాట్లాడే మాటనేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే జెండా గద్దెపై చేయి వేసి చూడాలని, తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తామని సవాల్ చేశారు. పదేళ్లలో తాము ఇదేవిధంగా ఆలోచిస్తే సీఎం ఎక్కడ ఉండేవాడని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వినాయక చవితి రోజు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, సీఎం వస్తే రూ. కోట్లు ఇచ్చి ఆదుకుంటారని ఆశించామన్నారు. నాలుగు నెలలైనా ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఇక్కడి ప్రజలపై సీఎంకు ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. 15 రోజులలో మీటింగ్ పెడతా అని పత్తా లేకుండా పోయారని విమర్శించారు.

Gampa Govardhan | రూ.150 కోట్ల అభివృద్ధి ఎక్కడ..?

కామారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పారని, పుస్తకం కూడా ప్రింట్ చేసి పంచారని, రూ.150 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఐదేళ్లలో రెండేళ్లు పోయిందని, చిల్లిగవ్వ పని అయిందా అని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. అధికార పార్టీలో ఉన్న షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాదని, ఎమ్మెల్సీ కూడా కాదని, ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యేగా బుగ్గ కారులో ఎస్కార్ట్ వేసుకుని తిరుగుతున్నారని గంప విమర్శించారు. షబ్బీర్ అలీకి రెండేళ్లలో కామారెడ్డి గుర్తుకు రాలేదని, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని పోలీసులను వెంటేసుకుని సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు కొబ్బరికాయలు కొడుతున్నారని తెలిపారు. సీఎం పక్క ఆఫీసులోనే ఉన్న ఆయన కామారెడ్డికి ఏం చేశారని ప్రశ్నించారు.

Gampa Govardhan | పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వస్తాయి

మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రజల్లోకి వెళ్దామని, ఇంటింటికీ ప్రభుత్వ వైఫల్యాలు చేరవేద్దామని కార్యకర్తలకు గంప గోవర్ధన్​ పిలుపునిచ్చారు. మరోసారి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీకి అనేక మంది దరఖాస్తు చేస్తున్నారని, టికెట్ ఇచ్చేది ఒక్కరికేనని తెలిపారు. టికెట్ రాని వాళ్లు పార్టీకి ద్రోహం చేయవద్దని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మనమేనని, పార్టీని నమ్ముకుంటే అవకాశాలు అవే వస్తాయన్నారు. ఈ 15 రోజులు పార్టీ కోసం కష్టపడదామని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మాదిరిగా కాదని, ప్రతి ఓటు ముఖ్యమేనని, ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...