అక్షరటుడే, ఆర్మూర్: Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Election) భాగంగా నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా, పోచంపాడ్, వేల్పూర్, భీమ్‌గల్ మండలం జాగిర్యాల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ గ్రామ పంచాయతీలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.
నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో (nomination reception centers) అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్‌డెస్క్‌లను పరిశీలించారు. మండలస్థాయి ఎన్నికల నిర్వహణ అధికారులతో నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై చర్చించి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్‌ను తనిఖీ చేశారు. టీపోల్ యాప్‌లో ఎన్నికల రిపోర్ట్లు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలన చేశారు. వేల్పూర్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం (Flying Squad team) పనితీరును పరిశీలించారు.
