అక్షరటుడే, ఎల్లారెడ్డి: Collector Kamareddy | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామ పంచాయతీలో (Kankal Gram Panchayat) నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ప్రతి నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
రెండో విడత నామినేషన్ల పరిశీలన, విత్డ్రా ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఏవైనా సందేహాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా మూడో విడత నామినేషన్లో చివరిరోజు ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని దానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
కామారెడ్డిలో (Kamareddy) మొదటిదశ నామినేషన్ ప్రక్రియ నవంబర్ 27న ప్రారంభమై నవంబర్ 29వ తేదీన ముగుస్తుందని పేర్కొన్నారు. మొదటి విడతలో మొత్తం 10 మండలాల్లో విస్తృతంగా నామినేషన్ దాఖలు అయ్యాయన్నారు.
Collector Kamareddy | నామినేషన్ వివరాలు
మొత్తంగా 1,520 వార్డులకు మొత్తం 3,833 నామినేషన్లు దాఖలయ్యాయని.. 167 సర్పంచ్ స్థానాలకు (sarpanch posts) 1,224 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ లెక్కింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు.
