అక్షరటుడే, ఆర్మూర్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గ (Armoor constituency) పరిధిలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 162 సర్పంచ్ స్థానాలకు, 1,620 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆర్మూర్ మండలం, డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్ మండలాల్లో సందడి నెలకొంది. మాక్లూర్ మండలం (Makloor Mandal) గుత్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోవింద్‌పేట్‌లో నామినేషన్ కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తనిఖీ చేశారు.
Local Body Elections | సింగంపల్లి తండా ఏకగ్రీవం..
మాక్లూరు మండలం సింగంపల్లి తండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ మొత్తంగా ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్‌గా జాదో శాంతాబాయి సవాయిరామ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను గ్రామస్థులు పూలమాలతో సన్మానించారు.
