అక్షరటుడే, గాంధారి: Local Body Elections | మండల కేంద్రంలో సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏకాదశి కావడంతో సర్పంచ్ అభ్యర్థులు (Sarpanch candidates) అధిక సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు.
తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ భార్య రేణుక ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గతంలో సర్పంచ్ బరిలో నిలిచి ఓడిన తూర్పు రాజులు భార్య రాజశ్రీ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే గాంధారి గ్రామ పంచాయతీకి (Gandhari Gram Panchayat) సర్పంచ్ అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియకు అధిక సంఖ్యలో వారి కులస్థులు, గ్రామస్థులు తరలివచ్చారు.

