Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | నామినేషన్ల స్వీకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి

Yellareddy | నామినేషన్ల స్వీకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి

నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో, భిక్కనూరు పంచాయతీ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి (RDO Parthasimha Reddy) పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో (Yellareddy MPDO), భిక్కనూరు పంచాయతీ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్డీవో మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల (Nominations) ప్రక్రియ మంగళవారంతో ముగియనుందన్నారు.

Yellareddy | టోకెన్లు జారీ ప్రక్రియ..

నామినేషన్లు వేసే ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు టోకెన్లు జారీచేసి క్రమపద్ధతిలో స్వీకరించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యాలయంలో తగిన వసతులు ఏర్పాటు చేయాలని సంబంధించిన సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్, వార్డు స్థానాల కోసం నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నామినేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్​ను పరిశీలించారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా పాటించాలని ఆయన సూచించారు.

Must Read
Related News