ePaper
More
    Homeఅంతర్జాతీయంJai Shankar | కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్​

    Jai Shankar | కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jai Shankar | భారత్​, పాకిస్తాన్(India-Pakistan)​ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎవరి జోక్యం లేదని, భారత్, పాక్ కలిసి చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ స్పష్టం చేశారు. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్​లో భాగంగా పీవోకే, పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్​ ధ్వంసం చేసింది. అనంతరం పాక్​ భారత్​పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. పాక్​ దాడులను తిప్పి కొట్టిన భారత్, పాకిస్తాన్​లోని ఎయిర్​బేస్​లను ధ్వంసం చేసింది.

    భారత్​, పాకిస్తాన్​ ఉద్రిక్తతల వేళ రెండు దేశాల డీజీఎంవో(DGMO)లు చర్చించుకొని కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(US President Donald Trump)​ తానే కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన భారత్​ కంటే ముందే సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. వాణిజ్యం పేరు చెప్పి రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్​లో తీవ్ర దుమారం రేగింది. ట్రంప్​ చెబితే మోదీ(PM Modi) ఎందుకు తలొగ్గారని విపక్షాలు ప్రశ్నించాయి.

    విపక్షాల ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ (External Affairs Minister Jaishankar) కాల్పుల విరమణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. భారత్, పాక్​ మధ్య మాత్రమే కాల్పుల విరమణ గురించి చర్చలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందన్నారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...