Banswada | ‘కల్లు అమ్మేందుకు లైసెన్స్ ఇవ్వట్లేదు..’

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కల్లు లైసెన్స్ ఇవ్వడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కల్లు గీత కార్మికుడు విఠల్ గౌడ్ ఆరోపించారు. మండలంలోని మొగులాన్ పల్లి గ్రామంలో (Mogulan Pally) బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పొలంలో పదేళ్ల క్రితం 1200 ఈత మొక్కలు నాటానని, ప్రస్తుతం ఈతకు వచ్చాయని అన్నారు. హరితహారంలో భాగంగా 2015లో అధికారులు 500 ఈత మొక్కలు ఇచ్చారని, 2009లో 700 ఈత మొక్కలు నాటానని వివరించారు. […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కల్లు లైసెన్స్ ఇవ్వడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కల్లు గీత కార్మికుడు విఠల్ గౌడ్ ఆరోపించారు. మండలంలోని మొగులాన్ పల్లి గ్రామంలో (Mogulan Pally) బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పొలంలో పదేళ్ల క్రితం 1200 ఈత మొక్కలు నాటానని, ప్రస్తుతం ఈతకు వచ్చాయని అన్నారు. హరితహారంలో భాగంగా 2015లో అధికారులు 500 ఈత మొక్కలు ఇచ్చారని, 2009లో 700 ఈత మొక్కలు నాటానని వివరించారు. గ్రామంలో ఒకే ఒక్క గౌడ కుటుంబం ఉందని, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకున్నప్పటికీ అబ్కారీ సీఐ (Excise Department) ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

Banswada | ఎంతోమంది అనర్హులకు లైసెన్స్​..

చెట్టు ఎక్కరాని వారికి సైతం ఎక్సైజ్​ సిబ్బంది లైసెన్సులు ఇచ్చారని.. అన్నీఉన్న తనకు లైసెన్స్​ ఇవ్వడంలో ఇబ్బందులుకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు లైసెన్స్​ ఇస్తే స్వచ్ఛమైన నీరా మాత్రమే విక్రయిస్తానని ఆయన వివరించారు. సమావేశంలో హరిదాస్, విఠల్ సింగ్, రాజ మహారాజ్, సవాయి సింగ్, శంకర్ పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...