అక్షరటుడే, బాన్సువాడ: ZPTC member : అధికార పెత్తనంతో ఓ వర్గం అక్రమ కేసులు బనాయిస్తూ భయాందోళనకు గురిచేసేందుకు యత్నిస్తోందని బీర్కూర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ అన్నారు. బీర్కూర్ మండలంలోని బైరాపూర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. గ్రామంలోని విఠలేశ్వరాలయ హుండీ లెక్కింపు విషయంలో ఇటీవల కొందరు తమపై దాడి చేశారన్నారు. అంతేగాక, దాడి చేసినవారే తిరిగి తమపై కేసులు పెట్టారని, ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ఆలయ బాధ్యతలు చేపట్టిన నుంచి రికార్డులు పక్కాగా నిర్వహిస్తున్నానని, రూపాయి తేడా వచ్చినా రూ. పది వేలు ఇస్తానన్నారు.