Donald Trump | ఆ దేశస్తులకు అమెరికాలోకి నో ఎంట్రీ.. డోనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస విధానాన్ని కఠినంగా పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడానికి, అనధికార వలసలను వెనక్కి పంపడానికి, విదేశీ పౌరులపై పరిశీలనను కఠినతరం చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి తన పరిపాలన కృషి చేస్తుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్​ హౌస్​ (White House) వద్ద […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస విధానాన్ని కఠినంగా పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడానికి, అనధికార వలసలను వెనక్కి పంపడానికి, విదేశీ పౌరులపై పరిశీలనను కఠినతరం చేయడానికి చర్యలు చేపట్టామన్నారు.

ఇందులో భాగంగా మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి తన పరిపాలన కృషి చేస్తుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్​ హౌస్​ (White House) వద్ద ఇటీవల కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అఫ్గాన్​ దేశస్తుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్​ గార్డ్స్​ మృతి చెందారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్​ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్‌తో సహా 19 దేశాల నుంచి వలస వచ్చిన వారి శాశ్వత నివాస స్థితిని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. మూడో ప్రపంచ దేశాల నుంచి పర్మనెంట్ రెసిడెంట్లను ఆపనున్నట్లు ట్రంప్​ సోషల్​ మీడియాలో (Social Media) ప్రకటించారు. ఇది అమెరికన్ వ్యవస్థను పునరుద్ధరించుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అమెరికా పురోగతిని వలస విధానాలు క్షీణింపజేస్తున్నాయన్నారు.

Donald Trump | సబ్సిడీలు రద్దు

అమెరికా పౌరులు కాని వారికి అన్ని సమాఖ్య ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దు చేస్తామన్నారు. దేశీయ ప్రశాంతతను దెబ్బతీసే వలసదారులను, ప్రజా బాధ్యత, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీ జాతీయుడిని అయినా బహిష్కరిస్తానని పేర్కొన్నారు. తక్కువ నుంచి మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు. ఇందులో ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా (America) ఓషియానియాలోని కొన్ని దేశాలు ఉన్నాయి. అమెరికాను ప్రేమించలేని వారిని తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్​ ప్రకటించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...