అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | యాసంగి సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో ఇప్పటికే వరి నాట్లు ప్రారంభించారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు (irrigation department officials) నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizam Sagar project) నుంచి ప్రధాన కాలువకు సోమవారం ఉదయం 08 గంటలకు నీటి విడుదలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నీటిని వృథా చేయకుండ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాలువ లోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా ఈ ఏడాది సమృద్ధి వర్షాలు పడటంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. దీంతో యాసంగి పంటలకు ఢోఖా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి నీటి విడుదల ప్రారంభం కానుండటంతో బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో సాగు పనులు ఊపందుకోనున్నాయి.