అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ఆయకట్టు కింద వానాకాలం పంటలు సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) నీటిని మంగళవారం విడుదల చేశారు. ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ అక్షయ్ కుమార్ అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు రెండు విడతల్లో నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం మూడో విడత నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలను హెచ్చుతగ్గులుగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు, 17.80 టీఎంసీలకుగాను 1391.31 అడుగులు, 4.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు నీటి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.