- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | ‘సాగర్’​ నుంచి యథేచ్ఛగా మొరం తవ్వకాలు

Nizamsagar Project | ‘సాగర్’​ నుంచి యథేచ్ఛగా మొరం తవ్వకాలు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | చెరువులు, కుంటల్లో మొరాన్ని దోచేస్తున్న అక్రమార్కులు ఏకంగా నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పై కన్నేశారు. ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే ధీమాతో భారీ జేసీబీలతో నిజాంసాగర్​ బ్యాక్​వాటర్​ ప్రాంతంలో మొరం దందాకు తెరలేపారు. ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా తరలించారు.

Nizamsagar Project | పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో..

ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో మొరం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. మహమ్మద్​నగర్​ (Mohammad nagar) మండలంలోని హసన్​పల్లి (Hasanpalli) జీపీ పరిధిలోని పిప్పిరేగడి తండాలో ఆదివారం మొరం అక్రమ రవాణాకు తెరదీశారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే రవాణా సాగించారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ (Irrigation Department) అధికారులు వివరణ నిమిత్తం ఫోన్​ చేయగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇకనైనా అధికారులు అక్రమ మొరం రవాణాపై దృష్టి పెట్టి బ్యాక్​ వాటర్​ ప్రాంతంలో మొరం దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News