Homeజిల్లాలుకామారెడ్డిNizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న వరద

Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న వరద

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్​లోకి వరద కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్​ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల నుంచి జలాశయంలోకి ఇన్​ఫ్లో వస్తోంది.

సింగూరు (Singuru)కు వరద కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project)​ పొంగిపొర్లుతోంది. ఆ నీరు నిజాంసాగర్​లోకి వస్తోంది. ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 13,958 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Nizam Sagar | కాలువకు నీటి విడుదల

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.7 (17.38 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. నాలుగు గేట్ల ద్వారా 21,988 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టు కోసం ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.