More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు కొనసాగుతున్న ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. సింగూరు, పోచారం డ్యామ్​ల (Singur and Pocharam dams) నుంచి జలాశయంలోకి వరద వస్తోంది.

    నిజాంసాగర్​లోకి ప్రస్తుతం 14,564 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1404.5 (17.07 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్​ అధికారులు (Nizamsagar Project officials) రెండు వరద గేట్లను ఎత్తి దిగువకు 13,564 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.

    Nizamsagar Project | పోచారం డ్యామ్​లోకి..

    పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project) పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి 2,137 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు డ్యామ్​పై నుంచి పొంగి పొర్లి మంజీరలో కలుస్తోంది. పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1.8 టీఎంసీలు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 22.5 టీఎంసీల వరద వచ్చింది. అందులో నుంచి ఆయకట్టు కోసం 0.156 టీఎంసీలు విడుదల చేశారు. 20.544 టీఎంసీలు మంజీరలోకి వెళ్లాయి.

    More like this

    Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

    అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు....

    Hyderabad Floods | మంచం కోసం వెళ్లి నాలాలో కొట్టుకుపోయారు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం...

    RRB Notification | నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్‌ఆర్‌బీనుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌...