అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | చెరువులు, కుంటల్లో మొరాన్ని దోచేస్తున్న అక్రమార్కులు ఏకంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్‌పై కన్నేశారు. ఆదివారం అధికారులు అందుబాటులో ఉండరనే ధీమాతో భారీ జేసీబీలతో నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతంలో మొరం దందాకు తెరలేపారు. ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా తరలించారు.
Nizamsagar Project | పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో..
ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో మొరం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. మహమ్మద్‌నగర్ (Mohammad nagar) మండలంలోని హసన్‌పల్లి (Hasanpalli) జీపీ పరిధిలోని పిప్పిరేగడి తండాలో ఆదివారం మొరం అక్రమ రవాణాకు తెరదీశారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే రవాణా సాగించారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ (Irrigation Department) అధికారులు వివరణ నిమిత్తం ఫోన్ చేయగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇకనైనా అధికారులు అక్రమ మొరం రవాణాపై దృష్టి పెట్టి బ్యాక్ వాటర్ ప్రాంతంలో మొరం దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.