అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar project) ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 1,02,369 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్‌కు వరద వస్తుండటంతో వరద గేట్ల ద్వారా 60 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.8 (17.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువన సింగూరుకు ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో (inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
Nizam sagar | పోచారం ప్రాజెక్ట్‌లోకి..
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌కు (Pocharam project) స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 1,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు వచ్చినట్లు అలుగుపై నుంచి పారుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లోకి 26.5 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 24.5 టీఎంసీలు ప్రాజెక్ట్‌పై నుంచి పొంగి దిగువకు వెళ్లింది. మరోవైపు ప్రాజెక్ట్ పొంగి పొర్లుతుండటంతో చూడటానికి పర్యాటకులు తరలి వస్తున్నారు.