అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు (Nizamsagar Project) వరద పోటెత్తుతోంది. దీంతో శుక్రవారం 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 1,18,246 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు వరద గేట్ల ద్వారా 1,25,740 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14.007 టీఎంసీల నీరు ఉంది.
Nizamsagar Project | అప్రమత్తంగా ఉండాలని సూచన..
క్రమం తప్పకుండా జలాశయం(Reservoir) నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రిస్క్ చేసి వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.