అక్షరటుడే, కుత్బుల్లాపూర్: Nizampet Municipal Corporation | హైదరాబాద్‌లోని నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్‌పై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నిజాంపేట్ పరిధి ప్రగతినగర్‌లో ప్రజలు ఆందోళనకు దిగారు. కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న త్రీ మంకీస్ చౌరస్తాలో శనివారం (నవంబరు 15) ధర్నా చేపట్టారు.![]()
Nizampet Municipal Corporation | తీవ్ర అవినీతి ఆరోపణలు..
ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. నిజాంపేట్ మున్సిపల్ ప్రస్తుత grade 3 స్థాయి కమిషనర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రస్తుత కమిషనర్ సాబిర్ అలీ పూర్తిగా విఫలం అయ్యారన్నారు. అవినీతి అక్రమాలతో మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.
పనులు, వసతుల కల్పనలో బంధు/వర్గ ప్రీతి చూపుతున్నారని వాపోయారు. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, సివిల్ వర్క్, టౌన్ ప్లానింగ్‌లో ఆర్థిక నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజల ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. పార్కులు, రోడ్ల ఆక్రమణల నియంత్రణలో విఫలం అయ్యారని ఎద్దేశా చేశారు.![]()
ప్రస్తుత కమిషనర్‌ను బదిలీ చేసి గ్రూప్ – 1 / ఐఏఎస్ స్థాయి అధికారిని కార్పొరేషన్‌కు కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం అవినీతి అధికారి చెర నుంచి నిజాంపేట్ కార్పొరేషన్‌ను కాపాడాలని కోరుతూ కోతి బొమ్మలకు వినతిపత్రం అందజేశారు.
