Akshara Today: వివిధ కేసుల్లో వచ్చే వారి నుంచి వసూళ్లకు పాల్పడడమే కాకుండా చీటీల పేరుతో తోటి సిబ్బందిని మోసగించిన ఓ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ conistable suspension వేటు పడింది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య cp sai Chaitanya nizamabad ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ 6 టౌన్ nizamabad నుంచి జిల్లా కోర్టు district court nizamabad విధులు నిర్వహిస్తున్న గజానంద్ జాదవ్ gajanad jadav (కానిస్టేబుల్ నెంబర్ 1922)ను సీపీ సాయిచైతన్య సస్పెండ్ చేశారు.
కోర్టులో వివిధ నేరాలకు సంబంధించిన క్రైమ్, తాత్కాలిక ప్రాపర్టీ విడుదల కేసులలో క్లైంట్ల నుంచి గజానంద్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. వివిధ కేసులలో అవినీతికి పాల్పడుతున్నట్టు టౌన్ 6 పోలీస్ స్టేషన్లో ఈ కానిస్టేబుల్‌పై కేసు కూడా నమోదు అయింది.
గజానంద్ జాదవ్ ప్రయివేటు చీటీల యాజమాన్యాల సహకారంతో పలు చీటీలు వేసి మోసపూరితంగా.. తన తోటి సిబ్బందిని, మిత్రులను గ్యారంటీరులుగా పెట్టించుకుని, తిరిగి డబ్బులు కట్టకుండా వారిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి నిజామాబాద్ 4వ పోలీస్ స్టేషన్లో fourth Town police station కూడా కేసు నమోదు అయింది. విచారణలో గజానంద్ మోసాలు వెలుగు చూడటంతో సీపీ సాయి చైతన్య nizamabad cp sai Chaitanya ఎట్టకేలకు కానిస్టేబుల్ పై వేటు వేశారు.