అక్షరటుడే, నిజామాబాద్ క్రైం/కోటగిరి: Drone surveillance | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (Nizamabad Police Commissionerate) కోడి పందేలు, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు పర్యవేక్షించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు గురువారం బోధన్ ఏసీపీ పర్యవేక్షణలో రుద్రూర్ సీఐ మార్గదర్శకత్వంలో వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలోని జలాల్‌పూర్, కోటయ్య క్యాంప్, శ్రీనగర్, నెహ్రూనగర్, హుమ్నాపూర్, జాకోరా గ్రామాల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న కోడి పందేలు, జూద కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టారు.
