అక్షరటుడే, ఇందూరు: Nizamabad Agriculture College | నిజామాబాద్ జిల్లా అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. టీపీసీసీ అధ్యక్షులు TPCC President, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ Mahesh Kumar Goud ఇచ్చిన హామీ ప్రకారం అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చినందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల సహకారంతో ఈ కళాశాల మంజూరుకు కృషి చేశానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Nizamabad Agriculture College | వాటితోపాటు జిల్లాకు..
కొడంగల్, హుజుర్‌నగర్, నిజామాబాద్ కు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రికి మహేష్‌కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అభివృద్ధి పట్ల తాను కట్టుబడి ఉన్నానని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కళాశాల వల్ల విద్యార్థులకు విస్తృత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అగ్రికల్చర్ కళాశాల మంజూరుతో జిల్లా విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది.