అక్షరటుడే, నిజాంసాగర్: Nizam sagar | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. జలాశయంలోకి ఆదివారం మధ్యాహ్నానికి భారీ ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 1,405.00 అడుగులు 17.80 టీఎంసీలకుగాను 1,391.27 అడుగులు 4.607 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం నుంచి 3,517 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Nizam Sagar | కర్ణాటకలో వర్షాలు పడితే..
మంజీర నదిపై (Manjira River) నిర్మించిన నిజాంసాగర్‌కు కర్ణాటకలో వర్షాలు పడితేనే భారీగా వరద వస్తుంది. మంజీరకు వరద వస్తే మొదట సింగూరు ప్రాజెక్ట్ నిండాలి. అనంతరం దిగువకు నీటిని విడుదల చేస్తారు.