అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nivetha Pethuraj | టీం ఇండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందాన (Smriti Mandana) తన పెళ్లి రద్దు విషయాన్ని ప్రకటించుకున్న కొద్దిసేపటికే… మరో సెలబ్రిటీ బ్రేకప్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నటి నివేదా పేతురాజ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆగస్టు 2024లో నివేదా తన బాయ్‌ఫ్రెండ్‌గా రాజ్‌హిత్ ఇబ్రాన్ (Rajhit Ibran)ను అధికారికంగా పరిచయం చేసింది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అందరు అనుకుంటున్న సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాజ్‌హిత్‌తో ఉన్న ఫోటోలు అన్నీ తొలగించడం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించింది.
Nivetha Pethuraj | ఎవరు ఈ రాజ్‌హిత్ ఇబ్రాన్?
అంతేకాదు, రాజ్‌హిత్ మరో అమ్మాయితో ఎంగేజ్ అయ్యాడని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఈ స్క్రీన్‌షాట్లు, హింట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరు ఈ రాజ్‌హిత్ ఇబ్రాన్ అంటే దుబాయ్ (Dubai)లో సెటిల్ అయిన మలయాళీ బిజినెస్‌మ్యాన్. Gunnayydin Luxury పేరిట ప్రైవేట్ జెట్ ఛార్టర్, లగ్జరీ కార్ రెంటల్ బిజినెస్ ఉంది. ఖరీదైన కార్లు, హాలిడేస్, వరల్డ్ టూర్స్‌తో హైఫై లైఫ్ గడుపుతున్నాడు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 16k ఫాలోవర్లు ఉండగా, తన వ్యక్తిగత అకౌంట్‌లో ఫాలో అయ్యే ఏకైక సెలబ్రిటీ నివేదా పేతురాజ్ మాత్రమే ఈ డీటెయిల్స్ కూడా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి.
‘మెంటల్ మదిలో’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా (Nivetha Pethuraj).. ‘చిత్రలహరి’, ‘రెడ్’, ‘పాగల్’, ‘దాస్ కీ దమ్కీ’, ‘Boo’ వంటి సినిమాల్లో నటించింది.అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలో చిన్న రోల్‌లో మెరిసింది. గత రెండు ఏళ్లుగా కొత్త సినిమాలు సైన్ చేయకపోవడంతో, ఆమె సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పిందన్న టాక్ వినిపించింది.అయితే ఇప్పుడు ఆమె ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిందా? రాజ్‌హిత్ నిజంగా ఇంకొక్కరితో ఎంగేజ్ అయ్యాడా? నివేదా మళ్లీ సినిమాల్లోకి రాబోతుందా? అనే ప్రశ్నలతో నెట్టింట చర్చలు నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవి రూమర్స్‌గానే ఉన్నా, త్వరలో నివేదా దీనిపై స్పందించే అవకాశం ఉందని అంటున్నారు.