Nita Ambani | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి నీతా అంబానీ భారీ విరాళం..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nita Ambani | హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma), పోచమ్మ దేవస్థానానికి(Pochamma temple) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధి కోసం ఆమె కోటి రూపాయలు విరాళంగా(One crore rupees donated) ప్రకటించి, బుధవారం ఆ మొత్తాన్ని దేవస్థానం ఖాతాలో జమ చేశారు. తరచూ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునే నీతా అంబానీ(Nita Ambani), ఈసారి ఇలా భారీ విరాళం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nita Ambani | హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma), పోచమ్మ దేవస్థానానికి(Pochamma temple) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధి కోసం ఆమె కోటి రూపాయలు విరాళంగా(One crore rupees donated) ప్రకటించి, బుధవారం ఆ మొత్తాన్ని దేవస్థానం ఖాతాలో జమ చేశారు. తరచూ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునే నీతా అంబానీ(Nita Ambani), ఈసారి ఇలా భారీ విరాళం ఇవ్వ‌డంతో దేవస్థానం అధికారులు.. వాటిని దేనికి వినియోగించాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ విరాళంపై స్పందించిన ఆలయ ఈవో మహేందర్ గౌడ్(Temple EO Mahender Goud) మాట్లాడుతూ..ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా వేసి, దాని వడ్డీ ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఏ ఒక్క భక్తుడూ ఆకలితో ఆలయం విడిచిపెట్టకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

Nita Ambani | భారీ విరాళం..

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు (Mumbai Indians) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడిన సందర్భంగా, నీతా అంబానీ తన తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌లతో కలిసి బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ అధికారులు ఆలయ విశిష్టతను వివరించడంతో పాటు, అభివృద్ధి పనులకు సహకారం అందించాలని ఆమెను కోరారు. ఆ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఈ విరాళం అందించారు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంకు బయలుదేరే ముందు ఆమె ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌ మధ్యలో కూడా అమ్మవారిని ప్రార్థించినట్లు విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సందర్భాలున్నాయి.

ఈ విరాళం నిత్య అన్నదానానికి అండగా నిలుస్తుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. భక్తులకు(Devotees) మరింత మంచి సేవలు అందించేందుకు ఇది దోహదపడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పుడు కూడా ఆమె స్టేడియం నుంచే అమ్మవారికి ప్రార్థనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2019 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించాలని ఆమె ప్రార్థిస్తున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ సారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ మంచి ప్ర‌ద‌ర్శ‌నే క‌న‌బ‌రిచింది. ప్లే ఆఫ్స్ వ‌ర‌కు చేరుకున్నా ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్ల‌లేక చ‌తికిల ప‌డింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...