అక్షరటుడే, బోధన్ : Bodhan | బంగారం కోసం మేనకోడలినే హత్య చేసిన ఘటన నవీపేట మండలం (Navipet Mandal)లో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామానికి (Malkapur Village) చెందిన ఆకుల అనంత అలియాస్ సోనీకి (29) గతంలో వివాహం జరిగింది.
అయితే తన భర్తతో విడిపోవడంతో తల్లి ఒడ్డెమ్మతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. అయితే తన మేనమామ పాండవుల సాగర్‌కు ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) మంజూరయ్యింది. ఇల్లు నిర్మించుకునేందుకు అనంతతో పాటు ఒడ్డెమ్మను డబ్బులు అడుగుతున్నాడు. కాగా.. మంగళవారం సాయంత్రం సమయంలో వీరి ఇంటికి వచ్చాడు. అయితే అనంత ఒంటరిగా ఉండడంతో ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారం తీసుకుని పారిపోయాడు. కాగా.. మృతురాలి తల్లి బొడ్డెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
