అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vivo V60e | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన వివో భారీ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను (Smart Phone) లాంచ్ చేసింది. వీ60ఈ పేరిట తీసుకువచ్చిన ఈ మోడల్‌లో 200 ఎంపీ కెమెరాను అమర్చింది. ఇందులో ఏఐ ఇమేజింగ్ క్యాపబిలిటీస్, ఆరా లైట్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు తెలుసుకుందామా..
వివో కంపెనీ తన వీ60(Vivo V60e) సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకువచ్చింది. వీ60ఈ పేరిట విడుదల చేసింది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అధికారిక రిటైల్ స్టోర్‌లలో లభ్యమవుతుంది.
డిస్‌ప్లే : ఇందులో 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేటు, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డైమెండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తుంది.
IP68, IP69 రేటింగ్ కలిగిన వాటర్ రెసిస్టెన్స్ సదుపాయం ఉంది.
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15తో పనిచేస్తుంది.
మీడియాటెక్ డైమెన్‌సిటీ 7360 టర్బో చిప్‌సెట్‌ను అమర్చారు.
కెమెరా : వెనకవైపు 200 మెగాపిక్సెల్ యాంటీ షేకింగ్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 30 ఎక్స్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇందులో ఆరా లైట్‌ను ఫ్లాష్‌లైట్‌గానూ వినియోగించుకోవచ్చు. ముందువైపు వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 50 ఎంపీ eye AF సెల్ఫీ సెన్సార్ ఉంది. ఏఐ ఫెస్టివల్ పోర్ట్రెయిట్, ఏఐ ఫోర్ సీజన్ పోర్ట్రెయిట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్ వంటి ఫీచర్లున్నాయి.
బ్యాటరీ : 6500 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 90w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్లు : మూడు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
8 GB ర్యామ్ 128 GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999.
8 GB ర్యామ్, 256 GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999.
12 GB ర్యామ్, 256 GB స్టోరేజీ వేరియంట్ రూ.33,999.
కార్డ్ ఆఫర్స్ : అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2 వేల వరకు డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.