OnePlus Bullets Wireless Z3 | ఏఐ ఫీచర్లతో కొత్త నెక్‌ బ్యాండ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: OnePlus Bullets Wireless Z3 | వన్‌ప్లస్‌ (OnePlus) కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, 36 గంటల ప్లేబ్యాక్‌ సపోర్ట్‌ ఉన్న దీని ధర రూ.1,699. చైనా(China)కు చెందిన వన్‌ప్లస్‌ సంస్థ భారత మార్కెట్‌లో నెక్‌బ్యాండ్‌ స్టయిల్‌ వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జెడ్‌3 (OnePlus Bullets Wireless Z3) ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. మూడేళ్ల క్రితం విడుదల చేసిన జెడ్‌2కు కొనసాగింపుగా దీనిని తీసుకువచ్చింది. ఈనెల 24 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: OnePlus Bullets Wireless Z3 | వన్‌ప్లస్‌ (OnePlus) కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేసింది. ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, 36 గంటల ప్లేబ్యాక్‌ సపోర్ట్‌ ఉన్న దీని ధర రూ.1,699.

చైనా(China)కు చెందిన వన్‌ప్లస్‌ సంస్థ భారత మార్కెట్‌లో నెక్‌బ్యాండ్‌ స్టయిల్‌ వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జెడ్‌3 (OnePlus Bullets Wireless Z3) ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. మూడేళ్ల క్రితం విడుదల చేసిన జెడ్‌2కు కొనసాగింపుగా దీనిని తీసుకువచ్చింది. ఈనెల 24 వ తేదీనుంచి వన్‌ప్లస్‌ ఇండియాతోపాటు దాదాపు అన్ని ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌, రిటైల్‌ ఔట్‌లెట్లలోనూ అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్‌ కంపెనీ ఈ నెక్‌ బ్యాండ్‌(Neck band)ను స్కిన్‌ ఫ్రెండ్లీ సిలికాన్‌ మెటీరియల్‌తో రూపొందించింది. ఇందులో 12.44 ఎంఎం డైనమిక్‌ బేస్‌ డ్రైవర్స్‌ ఉన్నాయి.

OnePlus Bullets Wireless Z3 | 3D స్పేషియల్‌(Spatial) ఆడియో ఎక్స్‌పీరియన్స్‌

ఇవి 3D స్పేషియల్‌(Spatial) ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. ఏఐ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సపోర్ట్‌, 21 గంటల కాల్‌, 36 గంటల ప్లేబ్యాక్‌ బ్యాటరీ బ్యాకప్‌, గూగుల్‌ ఫాస్ట్‌ పెయిరింగ్‌ సదుపాయాలను కలిగి ఉంది. ఇందులోని ఏఐ ఎన్విరాన్‌మెంట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌(Noise cancellation) సదుపాయం కాల్‌ మాట్లాడే సమయంలో చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలను నియంత్రిస్తుందని కంపెనీ పేర్కొంది.

యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ సాయంతో 10 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జ్‌ చేయొచ్చు. ఐపీ55 రేటింగ్‌ గల ఈ ఇయర్‌ ఫోన్స్‌ మాంబూ మిడ్‌నైట్‌, సాంబా సన్‌సెట్‌ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ Z3 ఇయర్‌ఫోన్స్‌ ధర రూ.1,699. దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...