Homeటెక్నాలజీWhatsapp | వాట్సాప్‌లో నయా ఫీచర్స్‌

Whatsapp | వాట్సాప్‌లో నయా ఫీచర్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Whatsapp | ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ అయిన వాట్సాప్‌(Whatsapp) ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. స్టేటస్‌(Status)ను మరింత ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా మార్చేందుకు ఇటీవల లే అవుట్‌, మోర్‌ విత్‌ మ్యూజిక్‌ (More with music) వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఫొటో స్టిక్కర్స్‌, యాడ్‌ యువర్స్‌ వంటి ఫీచర్లనూ తీసుకురాబోతోంది. ఆ ఫీచర్ల వివరాలు తెలుసుకుందామా..

Whatsapp | లే అవుట్‌ ఫీచర్‌..

వాట్సాప్‌ తన వినియోగదారుల స్టేటస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం కొల్లేజ్‌ (Collage) సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఎడిటింగ్‌ టూల్స్‌ (Editing tools)తో వినియోగదారులు ఒకేసారి ఆరు ఫొటోలను ఎంచుకుని, వాటిని నచ్చిన లేఅవుట్‌లోకి మార్చుకుని స్టేటస్‌గా పోస్ట్‌ చేయవచ్చు. ఈ ఫీచర్‌ మల్లీ ఇమేజ్‌ స్టోరీ టెల్లింగ్‌ను సులభతరం చేస్తుంది. అంటే ఫొటో(Photo)లను ఒక్కొక్కటిగా పోస్ట్‌ చేయడం కాకుండా.. ఒకేసారి గరిష్టంగా ఆరింటి వరకు స్టేటస్‌లో షేర్‌ చేయవచ్చు.

Whatsapp | మోర్‌ విత్‌ మ్యూజిక్‌..

వాట్సాప్‌ స్టేటస్‌లకు మ్యూజిక్‌ యాడ్‌ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. మోర్‌ విత్‌ మ్యూజిక్‌ ఫీచర్‌తో వినియోగదారులు నేరుగా తమ స్టేటస్‌గా పాటను పోస్ట్‌ చేసుకోవచ్చు. మన మూడ్‌(Mood)ను లేదా ఇష్టాలను స్టేటస్‌ ద్వారా తెలియజేడానికి అవకాశం ఉంటుంది.

Whatsapp | ఫొటో స్టిక్కర్స్‌

ఈ ఫీచర్‌ ద్వారా ఏదైనా ఫొటోను లేదా సెల్ఫీ(Selfie)ని స్టిక్కర్‌గా మార్చుకుని స్టేటస్‌గా పోస్ట్‌ చేయవచ్చు. దీనికోసం ఫొటోను క్రాప్‌ చేయడం, రీసైజ్‌ చేయడం, షేప్‌ మార్చడం వంటి ఎడిటింగ్‌ ఆప్షన్లను అందుబాటులోకి తెస్తోంది.

Whatsapp | యాడ్‌ యువర్స్‌..

వాట్సాప్‌ తన వినియోగదారులకు యాడ్‌ యువర్స్‌(Add yours) ఫీచర్‌ అనే ఫీచర్‌ కూడా తీసుకు రావాలని యోచిస్తోంది. ఇది ఇంటరాక్టివ్‌ స్టిక్కర్‌. దీని సహాయంలో ఒక ఫొటో లేదా వీడియోతో ఒక ప్రశ్నను జోడించి స్టోరీలో పోస్ట్‌ చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఫొటోకు యాడ్‌ యువర్‌ స్టిక్కర్‌ను జోడించి వాట్సాప్‌ స్టోరీలో పోస్ట్‌ చేయవచ్చు. దానిని చూసినవారు వాటి స్టేటస్‌లో తమ సమాధానాలను షేర్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ఫ్రెండ్స్‌తో సరదాగా ఇంటరాక్ట్‌ కావడానికి ఉపయోగపడుతుంది.