- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలి

Bheemgal | ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలి

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కాంగ్రెస్​ నాయకులు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్​ బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Mutyala Sunil Kumar) ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్​లో (Hyderabad)లో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ను (PCC Chief Bomma Mahesh kumar) కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో నిలిచిపోయిన 100 పడకల ఆస్పత్రి, సమీకృత మార్కెట్ సముదాయ భవనాల పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరారు.

Bheemgal | నూతన భవనాలు మంజూరు చేయాలి

మండలంలో తహశీల్దార్​, సబ్ రిజిష్ట్రార్​ కార్యాలయం, అగ్రికల్చర్, ఎంఈవో, డిగ్రీ కళాశాల, గెస్ట్ హౌస్, నూతనంగా మంజూరైన కోర్టు, ముచ్కూర్ సొసైటీ భవనం, రహత్ నగర్​లో గోదాములు తదితర కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన వెంటనే ఆయాశాఖల మంత్రులతో ఫోన్​లో మాట్లాడారు. ఆయా కార్యాలయాలకు నూతన భవనాలను మంజూరు చేయాలని వారిని కోరినట్లు నాయకులు తెలిపారు.

- Advertisement -

వారు సైతం స్పందించి నూతన భవనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణాధ్యక్షులు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, కార్యదర్శి భోజా గౌడ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మల్లెల లక్ష్మణ్, ముచ్కూర్ సొసైటీ ఛైర్మన్ బంగ్లా దేవేందర్, శీను, రాగుల మోహన్, ఏఎంసీ డైరెక్టర్ జీవన్, గట్టు సతీష్, భీమ్​గల్​ విలేజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి, శ్రీధర్ గౌడ్, పల్లె శేఖర్, కొరడి లింబాద్రి, బీసీ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News