Open AI | ఓపెన్‌ ఏఐ నుంచి కొత్త బ్రౌజర్‌.. గూగుల్‌కు పోటీ ఇచ్చేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Open AI | ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన ఓపెన్‌ ఏఐ(OPEN AI) గూగుల్‌ క్రోమ్‌(Google chrome)కు పోటీగా వెబ్‌ బ్రౌజర్‌(Web browser)ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది పూర్తిగా ఏఐ ఆధారితంగా పనిచేయనుంది. త్వరలోనే దీనిని లాంచ్‌ చేసే అవకాశాలున్నాయి. బ్రౌజర్లు ఎన్ని ఉన్నా.. ఏదైనా సమాచారం కోసం వెతికేటప్పుడు ఎక్కువగా గూగుల్‌పైనే ఆధారపడతాం. ఫైర్‌ఫాక్స్‌(Firefox), సఫారీ, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, ఒపెరా, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, బ్రేవ్‌, క్రోమియం, యూసీ బ్రౌజర్‌(UC browser) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Open AI | ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన ఓపెన్‌ ఏఐ(OPEN AI) గూగుల్‌ క్రోమ్‌(Google chrome)కు పోటీగా వెబ్‌ బ్రౌజర్‌(Web browser)ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది పూర్తిగా ఏఐ ఆధారితంగా పనిచేయనుంది. త్వరలోనే దీనిని లాంచ్‌ చేసే అవకాశాలున్నాయి.

బ్రౌజర్లు ఎన్ని ఉన్నా.. ఏదైనా సమాచారం కోసం వెతికేటప్పుడు ఎక్కువగా గూగుల్‌పైనే ఆధారపడతాం. ఫైర్‌ఫాక్స్‌(Firefox), సఫారీ, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, ఒపెరా, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, బ్రేవ్‌, క్రోమియం, యూసీ బ్రౌజర్‌(UC browser) వంటి బ్రౌజర్లు ఉన్నా.. ఈ రంగంలో గూగుల్‌దే గుత్తాధిపత్యం. ఇంటర్నెట్‌లో సమాచారం వెతకడం అంటే గూగుల్‌ క్రోమే గుర్తుకు వస్తుంది. అయితే దీనికి పోటీ ఇవ్వడానికి ఓపెన్‌ ఏఐ కొత్త బ్రౌజర్‌ను తీసుకువస్తోంది.

వినియోగదారుల డాటా, వెబ్‌ నావిగేషన్‌ (Web navigation) అలవాట్లను మరింత సుదీర్ఘంగా విశ్లేషించి, ఏఐ సామర్థ్యాన్ని వినియోగించేలా దీనిని రూపొందిస్తోంది. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేయనుంది. ఈ బ్రౌజర్‌ మన అవసరాన్ని అర్థం చేసుకుని, అవసరమైన సమాచారాన్ని సులభంగా, క్లుప్తంగా అందిస్తుందని భావిస్తున్నారు. ఇది కేవలం ఇంకో బ్రౌజర్‌గా మాత్రమే నిలవదని, ఈ రంగంలో ఒక విప్లవాత్మక మార్పునకు నాందిగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్‌ ఏఐ విడుదల చేయబోయే కొత్త బ్రౌజర్‌ విస్తృతంగా ఉపయోగించబడితే అది గూగుల్‌ క్రోమ్‌ బౌజర్‌కు బలమైన పోటీదారుగా మారే అవకాశాలున్నాయి.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...