అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UIDAI | భారతీయులకు ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 12 అంకెల ఈ విశిష్ట గుర్తింపు నంబర్‌ను కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేస్తుంది. బ్యాంక్ ఖాతా ప్రారంభం నుంచి పాన్ కార్డు, ఓటర్ కార్డు ,ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు వరకు ఆధార్ కార్డు తప్పనిసరి.
కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆధార్ కార్డే (Aadhaar Card) ఆధారం. అలాంటి ముఖ్యమైన పత్రంలో పొరపాట్లు ఉంటే, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పేరు, జన్మతేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి వివరాలు ఎప్పటికప్పుడు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
UIDAI | UIDAI నుంచి కొత్త నిర్ణయం
దేశవ్యాప్తంగా ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఉన్నప్పటికీ, యూజర్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు UIDAI కొత్త కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న My Aadhaar App కు అదనంగా, మరో కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్ నంబర్, పేరు, చిరునామా, ఇమెయిల్ వంటి వివరాలను సులభంగా అప్డేట్ చేసుకునే వీలు కల్పిస్తోంది. కొత్త ఆధార్ యాప్ (Aadhaar App)లో ఫేస్ అథెంటికేషన్ చేసి అన్ని సేవలు పొందవచ్చు. దీంతో ఇకపై అప్డేట్‌ల కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గనుంది.
ప్రస్తుతం మొబైల్ నంబర్ అప్డేట్ (Mobile Number Update) సేవ ఇప్పటికే లైవ్‌లో ఉంది. మిగతా వివరాల అప్డేట్ అవకాశాలు ఇంకా అభివృద్ధి దశలో ఉండగా, త్వరలో అందుబాటులోకి రానున్నట్లు UIDAI ప్రకటించింది.ఇంటి నుంచే మొబైల్ నంబర్‌ను ఎలా అప్డేట్ చేసుకోవాలి? – పూర్తి వివరాలు
- కొత్త ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి
- UIDAI విడుదల చేసిన కొత్త యాప్‌ను ప్లేస్టోర్/యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేసి “My Aadhaar Update” సెక్షన్‌లోకి వెళ్లండి
- కింద సర్వీసెస్ విభాగంలో My Aadhaar Update పై క్లిక్ చేయండి.
- “Mobile Number Update” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
- అక్కడ “Mobile Number Update” పై క్లిక్ చేస్తే సంబంధిత వివరాలు కనిపిస్తాయి.
- ఫీజు & ప్రాసెసింగ్ టైమ్
UIDAI | ప్రాసెసింగ్ టైమ్: గరిష్టంగా 30 రోజులు
చార్జీ: ₹75
- కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయండి
- ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి
- ₹75 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి
- రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది
30 రోజుల్లోపు మొబైల్ నంబర్ ఆధార్‌లో అప్డేట్ అవుతుంది.
UIDAI | త్వరలో మరిన్ని సేవలు లైవ్
పేరు, చిరునామా, జనన తేదీ, ఇమెయిల్ వంటి వివరాలను కూడా ఇదే యాప్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని UIDAI స్పష్టం చేసింది.