అక్షరటుడే, కామారెడ్డి: SP Kamareddy | ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ (Machareddy police station) పరిధిలోని చెక్‌పోస్ట్‌ను మంగళవారం పరిశీలించారు. చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
SP Kamareddy | క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. దీనికోసం చెక్‌పోస్ట్ వద్ద బారికేడ్లను వినియోగిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్యూటీ రోస్టర్ ప్రకారం.. సిబ్బంది క్రమబద్ధంగా విధులు నిర్వహించాలన్నారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అక్రమ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని, ప్రజలకు శాంతి భద్రతలు అందిచడమే పోలీస్ శాఖ (police department) లక్ష్యమన్నారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి బాధ్యతతో పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఈ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయని తెలిపారు. ఎస్పీ వెంట మాచారెడ్డి ఎస్సై అనిల్ (Machareddy Sub-Inspector Anil), సిబ్బంది ఉన్నారు.
