Homeజిల్లాలుకామారెడ్డిMPDO Suspended | ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. నాగిరెడ్డిపేట ఎంపీడీవో, ఎంపీవోపై సస్పెన్షన్​ వేటు

MPDO Suspended | ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. నాగిరెడ్డిపేట ఎంపీడీవో, ఎంపీవోపై సస్పెన్షన్​ వేటు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగిరెడ్డిపేట ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్​చారిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MPDO Suspended | గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగిరెడ్డిపేట ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్ చారిలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచులు, వార్డు సభ్యుల కోసం నామినేషన్ పత్రాలు సమర్పించిన లెక్కలను జిల్లా అధికారులకు సమర్పించిన నివేదికలో వ్యత్యాసం నెలకొంది. దీంతో బుధవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎల్పీవో (Yellareddy DLPO) సురేందర్, ఎంపీడీవో కార్యాలయానికి (MPDO Office) చేరుకున్నారు. ఆ సమయంలో ఎంపీడీవో, ఎంపీవోలు ఇద్దరు కూడా కార్యాలయంలో లేరు.

ఇద్దరు అధికారులు స్థానికంగా అందుబాటులో లేరని గుర్తించారు. దీంతో ఆఫిస్ సిబ్బందితో నామినేషన్ పత్రాలను సరిచేసి అధికారులకు నివేదిక సమర్పించారు. ఎన్నికల వేళ స్థానికంగా ఉండకపోవడంతో పాటు దాఖలైన నామినేషన్ పత్రాల లెక్కల్లో వ్యత్యాసం ఉండటంతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్​ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Must Read
Related News