అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NBK 111 | తన అభిమానులను ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో అలరించే నటసింహం నందమూరి బాలకృష్ణ, మరోసారి దర్శకుడు గోపిచంద్ మలినేని (Director Gopichand Malineni)తో చేతులు కలిపారు. వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఈ విజయవంతమైన కాంబినేషన్ ఇప్పుడు ఒక గ్రాండ్ హిస్టారికల్ ఎపిక్ కోసం రెడీ అవుతోంది.
వెంకట సతీష్ కిలోరు నిర్మిస్తున్న ఈ మాస్–పీరియడ్ డ్రామా ఇప్పటికే భారీ బడ్జెట్, భారీ స్కేల్‌తో తెరకెక్కుతోందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా మరో పెద్ద అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. స్టార్ హీరోయిన్ నయనతార (Star heroine Nayanthara) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనుందని వెల్లడించారు. ఈ వార్తను ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘NBK 111’ టీమ్ ప్రత్యేకంగా ప్రకటించింది.
NBK 111 | మళ్లీ ఆయనకి జతగా..
ఆమె ఎంట్రీని దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియాలో ‘ద క్వీన్ ఈస్ హియర్’ అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చేశారు. నయనతార–బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్ ఇప్పటికే సింహా , శ్రీరామ రాజ్యం, జై సింహా వంటి చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ ఇద్దరి జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కథలో నయనతార పాత్ర ఎంతో కీలకమని చిత్ర యూనిట్ చెబుతోంది. మాస్ యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ గా నిలిచిన గోపిచంద్ మలినేని, ఈసారి తొలిసారి హిస్టారికల్ జానర్‌ను అటెంప్ట్ చేస్తుండటం ఆసక్తికర అంశం. భారీ సెట్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్‌తో నిండిన కథనం ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించనున్నట్టు సమాచారం.
అఖండ 2 ప్రమోషన్స్ , రిలీజ్ కార్యక్రమాలు పూర్తయ్యాక బాలకృష్ణ ఈ కొత్త ఎపిక్ సినిమాలో షూట్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే NBK ఫ్యాన్స్ ఈ సినిమాపై అద్భుతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. బాలయ్య–నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వాళ్లు ఎలా కనిపిస్తారో అనేది పెద్ద కుతూహలం. పవర్‌ఫుల్ స్టోరీ, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, అగ్ర దర్శకుడు అన్నీ కలిసి NBK 111 ను టాలీవుడ్ హిస్టారికల్ క్రేజీ సినిమాల్లో ఒకటిగా నిలుపుతుంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ ఈ మాస్ హిస్టారికల్ ఎపిక్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Here she comes…
Welcoming the one and only Queen #Nayanthara garu into the world of #NBK111 🤗❤️Honoured to have her power and grace in our story. Wishing you a wonderful Birthday. Excited to see you on set soon. ❤️❤️@nbk111movie
GOD OF MASSES #NandamuriBalaKrishna… pic.twitter.com/p2IVepbpa7
— Gopichandh Malineni (@megopichand) November 18, 2025
