HomeUncategorizedINS Arnala | భార‌త నౌకాద‌ళానికి మరింత బ‌లం తీసుకురాబోతున్న అర్ణాలా.. డ్యూటీలోకి ఎప్పుడు దిగ‌నుందంటే..!

INS Arnala | భార‌త నౌకాద‌ళానికి మరింత బ‌లం తీసుకురాబోతున్న అర్ణాలా.. డ్యూటీలోకి ఎప్పుడు దిగ‌నుందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: INS Arnala | భారత నావికాద‌ళం(Indian Navy)త‌న సంప‌త్తిని క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 9 నుంచి 10 కొత్త కొత్త యుద్ధ నౌక‌లు భార‌త నావికాద‌ళంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో నౌకదళం తన శక్తిని గణనీయంగా విస్తరించుకుంటుంది. ఈ నూతన చ‌ర్య‌లో భాగంగా యాంటీ సబ్​మెరైన్​ వార్ షేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ యుద్ధ నౌక అర్ణాల(Arnala)ను జూన్ 18న విశాఖలో నేషనల్ డాక్ యార్డులో కమిషన్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇది నావిక బలాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తుంది. త్వరలో కమిషన్ చేయనున్న ఎక్కువ నౌక‌లు దేశీయంగా తయారు చేసినవేన‌ని అధికారులు అంటున్నారు.

INS Arnala | మ‌రో కొత్త నౌక‌..

కమిషనింగ్ కార్యక్రమంలో ఏఎస్‌డ‌బ్ల్యూ,(ASW), ఎస్‌డ‌బ్ల్యూసి(SWC) విభాగానికి చెందిన మ‌రిన్ని నౌక‌లు కూడా ఉంటాయ‌ని, అవి కూడా విశాఖపట్నం నుంచి క‌మీష‌న్ చేయ‌బ‌తాయని అధికారులు పేర్కొన్నారు. అర్ణాలా ప్రత్యేకతలు ఏంట‌నేది చూస్తే.. తీర ప్రాంతాల్లో శత్రు సబ్‌మెరిన్‌లను గుర్తించగలిగే సామర్థ్యం, డీజిల్-వాటర్‌జెట్ కాంబినేషన్‌(Diesel-waterjet combination)తో నడిచే భారత నావికాదళంలోని తొలి నౌక, 77 మీటర్ల పొడవు, 25 నాట్స్ వేగం, 1800 నాటికల్ మైళ్లు ఎండ్యూరెన్స్, 80% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మాణం, మహీంద్రా డిఫెన్స్(Mahindra Defence), వంటి సంస్థల సాంకేతిక భాగస్వామ్యం దీని ప్ర‌త్యేక‌త‌లుగా చెప్పుకోవ‌చ్చు.

ఈ నూతన నౌకతో భారత తీర భద్రత మరింత బలోపేతం కానుండగా, ప్రస్తుతం సేవలలో ఉన్న నౌకలకు ఇది సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ఈ నౌకకు మహారాష్ట్ర(Maharashtra)లోని వసాయ్ సమీపంలోని చారిత్రక అర్ణాల కోట పేరు పెట్టారు. ఆ కోట ఎలా పలు శత్రు దాడులను తట్టుకుని నిలిచిందో, ఈ నౌక కూడా సముద్ర మార్గాల్లోని ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించబడింది. కోల్‌కతా ఆధారిత గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ (GRSE) మరియు లార్సెన్ & టుబ్రో (L&T) పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో దీనిని రూపొందించారు. ఈ నౌక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ప్రతిబింబించేలా 80 శాతం దేశీయ కంటెంట్‌తో, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడింది.