- Advertisement -
HomeUncategorizedPahalgaon terrorist attack | రీల్ కాదు.. రియల్ హీరో..నేవీ ఆఫీసర్ వీడియో నెట్టింట వైరల్​

Pahalgaon terrorist attack | రీల్ కాదు.. రియల్ హీరో..నేవీ ఆఫీసర్ వీడియో నెట్టింట వైరల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pahalgaon terrorist attack : ఇటీవలే వివాహం అయిన నవజంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ దంపతులు హనీమూన్​ కోసం పహల్గావ్ వెళ్లారు. ఈ తరుణంలోనే ఆయన ఉగ్రమూకల పాశవిక దాడికి బలి అయ్యారు. కాగా, ఉగ్రదాడికి ముందు నవజంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ దంపతులు పహల్గావ్​లో సరదాగా రీల్​ చేశారు. కశ్మీర్​ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ రీల్​ నెట్టింట వైరల్​ అవుతోంది.

కాగా, నెటిజన్లు వినయ్​ నర్వాల్​పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రీల్​ కాద..రియల్​ హీరో అంటూ కొనియాడుతున్నారు. ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన హీరోగా పొగుడుతున్నారు. తుపాకీ గుండ్ల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు తీసిన వినయ్​ను మెచ్చుకుంటున్నారు. మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరోగా అభివర్ణిస్తున్నారు.

- Advertisement -

- Advertisement -
- Advertisement -
Must Read
Related News